మంత్రాలయం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్: అరలబండలో 62.24 శాతం ఓటింగ్ నమోదు

రిపోర్టర్: గోపి స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ఆర్లబండ గ్రామం రెండు నంబర్ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో మొత్తం తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లకు గాను ఐదు వందల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి లెక్కింపు కేంద్రానికి తరలించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.