షేర్గూడెంలో ఎస్బీ ఫిదా పత్తి రకంతో రైతులకు కాసుల వర్షం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
నవాబుపేట మండలం షేర్గూడెం గ్రామంలో ఎల్ఎస్ఆర్ సీడ్స్ ఆధ్వర్యంలో ఎస్బీ ఫిదా బీజీ-2 పత్తి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు అక్బర్ సాగుచేసిన పంట ఏపుగా పెరిగి అధిక కాయలు కాయడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రకం అధిక దిగుబడినిస్తుందని ఏరియా బ్రాంచ్ మేనేజర్ వి. రమణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎం. సుధాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రైతులు పాల్గొన్నారు.