దిల్లీలో గ్రీన్ టపాసులకు మాత్రమే అనుమతి: వేళలు వెల్లడించిన అధికారులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: దిల్లీ

దిల్లీలో గ్రీన్ టపాసులు కాల్చేందుకు రెండు గంటల పాటు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం సీఎస్ఐఆర్-నీరి ధ్రువీకరించిన హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్లైన్ విక్రయాలను నిషేధించామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.