పన్నెండేళ్లు పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగికి ఘోర అవమానం!
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో 12 ఏళ్లుగా సేవలందించిన సౌరభ్ అనే ఉద్యోగిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. సిస్టమ్‌లోకి లాగిన్ కాకపోవడంతో తాను ఉద్యోగం కోల్పోయినట్లు ఆయన తెలుసుకున్నారు. పండగలు, సెలవులు అనకుండా అంకితభావంతో పనిచేసిన తన భర్తకు జరిగిన ఈ అన్యాయంపై ఆయన భార్య పూజా సాహు లింక్డ్‌ఇన్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది.