తుమ్మిడిహెట్టి నుంచి నీరు తెస్తే రాజీనామా: మంత్రి ఉత్తమ్కు హరీశ్ రావు సవాల్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తెస్తామన్న మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్లోని తెలంగాణభవాన్లో మీడియాతో మాట్లాడుతూ, నీటిని తెచ్చి నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే మంత్రి ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడుతూ, మేడిగడ్డకు మరమ్మతులు చేసి మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.