నా సినిమాలను నేను మళ్లీ చూసుకోలేను: ప్రీతి జింటా

రిపోర్టర్: రమేష్ స్థలం: Mumbai

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన సినిమాలను తాను తెరపై చూడలేనని స్పష్టం చేశారు. పూర్తియిన సినిమాలను మళ్లీ చూడటం తనకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, నటనలో లోపాలు వెతుక్కునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. తన రాబోయే 'వైబ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ తెరపై తనను తాను చూసుకోవడం విచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.