బెంగళూరు జిమ్లో వీరంగం సంచలనంగా మారిన వీడియో
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని ఇందిరానగర్ కల్ట్ ఫిట్ జిమ్లో వాయి దొరకలేదనే కోపంతో ఓ వ్యక్తి ఇరవై కిలోల బరువున్న జిమ్ ప్లేట్లను నేలకేసి కొట్టి వీరంగం సృష్టించాడు. తోటి సభ్యులు తన వంతు వచ్చే వరకు వేచి ఉండాలని కోరడంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిమ్ యాజమాన్యం అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇందిరానగర్ పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.