విజయవాడలో డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగులు మరియు వైసీపీ ఆందోళన

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

విజయవాడలో డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తూ నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ జంతర్ మర్ ను తలపించేలా సాగిన ఈ నిరసనలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.