దారుణం: తిరువనంతపురంలో పదహారేళ్ల విద్యార్థి హత్య కలకలం

రిపోర్టర్: హరి స్థలం: Thiruvananthapuram

తిరువనంతపురంలో పదహారేళ్ల విద్యార్థి అభిరామ్ హత్యకు గురైనట్లు నగర పోలీస్ కమిషనర్ అరుణ్ ఆర్ బి కృష్ణ వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలికతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని, బెల్టుతో గొంతు బిగించి చంపి శవాన్ని బస్తాలో కుక్కినట్లు పోలీసులు తెలిపారు.