కే కోటపాడులో ఘనంగా జనరల్ బాడీ సమావేశం నిర్వహణ
రిపోర్టర్: విజయ్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎంపీపీ మరియు ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో వారి సేవలను అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.