అద్భుతం: యాభై ఏళ్ల వయసులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
సమాజం నిర్దేశించిన కాలచక్రానికి భిన్నంగా నడుచుకుంటూ నలభై ఎనిమిదేళ్ల వయసులో వివాహం చేసుకున్న ఒలుసోలా ఒలోనాడే యాభై ఏళ్ల వయసులో తొలిసారిగా నలుగురు శిశువులకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించారు. ఐవీఎఫ్ సాంకేతికత సహాయంతో తాను ఈ అద్భుతమైన అనుభూతిని పొందానని, ఒకేసారి నలుగురు పిల్లలు పుడతానని తాను అసలు ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేశారని బీబీసి ఆఫ్రికా తెలిపింది.