దసరా ప్రయాణికులకు తీపి కబురు: ఏడు వేల ప్రత్యేక బస్సులు నడపనున్న టీజీఎస్ఆర్టీసి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం సూచించింది.