ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకోసం పీఎం విద్యాలక్ష్మి పథకం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఆసరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ ఇండియా వెల్లడించింది. కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫీజుల గురించి ఆందోళన చెందకుండా తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులు సులభంగా విద్యా రుణాలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. అర్హత వివరాలను అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.