మహిళల్ లో రొమ్ము సాంద్రతపై అవగాహన ముఖ్యం: డాక్టర్ స్మృతి జైన్ వెల్లడి

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

మహిళల్ లో రొమ్ము సాంద్రత అనేది క్యాన్సర్ ముప్పును అంచనా వేయడంలో కీలకమని మదర్ హుడ్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్మృతి జైన్ స్పష్టం చేశారు. రొమ్ము సాంద్రత అనేది సాధారణ లక్షణమే తప్ప క్యాన్సర్ కాదని ఆమె తెలిపారు. అయితే సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మమోగ్రామ్ పరీక్షలో కణితులను గుర్తించడం కష్టమవుతుందని, అందువల్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ స్మృతి జైన్ సూచించారు.