విజయనగరం జిల్లాలో రాజకీయ కలకలం: జడ్పీటీసి బరిలో బొత్స కుటుంబం నుంచి నలుగురు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే సమయానికి విజయనగరం జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స కుటుంబం నుంచి నలుగురు వేర్వేరు మండలాల నుంచి జడ్పీటీసి స్థానాలకు నామపత్రాలు దాఖలు చేశారు. కుమార్తె అనూష బొండపల్లి నుంచి, కోడలు పూజిత గరివిడి నుంచి, సోదరి లక్ష్మి గుర్ల నుంచి, సోదరుడు లక్ష్మణరావు కుమారుడు చైతన్య పూసపాటిరేగ నుంచి బరిలో నిలిచారని అధికారులు తెలిపారు.