విమానాశ్రయాల నామకరణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని వరంగల్ మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి, ఆదిలాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేర్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ మేరకు పేర్లను సూత్రప్రాయంగా ఖరారు చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు.