అల్లం వారి కుంట సాధించే వరకు విశ్రమించేది లేదన్న రైతులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో అల్లం వారి కుంట సాధనకై రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మహిళా రైతులు, స్థానిక నేతలు రాష్ట్ర రహదారిపై నిర్వహించిన రాస్తారోకో, వంటవార్పు కార్యక్రమాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో భూస్వాముల పేరిట చేసిన అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని సముద్రాల శంకర్, దాసరి తిరుపతి డిమాండ్ చేశారు. హక్కులు సాధించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించిన బాధితులకు పలు గ్రామాల ప్రజలు మద్దతు తెలిపారు.