ఏపీలో మృత్యు మార్గాలుగా మారుతున్న జాతీయ రహదారులు!

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో 18,319 ప్రమాదాలు జరగగా, అత్యధికంగా జాతీయ రహదారులపైనే 7,987 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జాతీయ సరాసరి కంటే రాష్ట్రంలో మరణాల రేటు 17.5 శాతం అధికంగా ఉన్నట్లు పోలీసు శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.