అంతర్జాతీయ నిరసనల కుట్ర: వందకు పైగా సంస్థలపై ఫాక్స్ న్యూస్ సంచలన కథనం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఫ్రాన్స్ అల్లర్లతో పాటు భారత్ వంటి దేశాల్లో యువత చేపట్టిన నిరసనల వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని ఫాక్స్ న్యూస్ డిజిటల్ దర్యాప్తు వెల్లడించింది. ఈ మేరకు పదమూడు దేశాలకు చెందిన నూటఒక సంస్థలు సరిహద్దులు దాటి ఆందోళనలను సమన్వయం చేస్తున్నాయని జర్నలిస్ట్ అశ్రా క్యూ నోమానీ మంగళవారం ప్రచురించిన తాజా నివేదికలో స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.