ఢిల్లీ హాత్ టికెట్ ధరలపై విదేశీయుడి వివాదాస్పద వ్యాఖ్యలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ హాత్‌లో విదేశీయులకు ఎక్కువ టికెట్ ధర వసూలు చేయడంపై టైలర్ బ్లండెన్ అనే పర్యాటకుడు 'జాతి వివక్ష' అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, పాశ్చాత్య దేశాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పన్నుల ద్వారా నిర్వహించే ప్రదేశాల్లో భారతీయులకు రాయితీ ఉండటం సహజమని నెటిజన్లు అతనికి కౌంటర్ ఇస్తున్నారు.