ఖమ్మం కొత్త కలెక్టరేట్ ముందు ఈవీ కారు దగ్ధం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయం ముందు షార్ట్ సర్క్యూట్తో ఈవీ కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.