అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం భారీగా నిరీక్షించాలన్న నివేదికలు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అమెరికా వెళ్లే భారతీయులకు విజిటర్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం భారీగా నిరీక్షించాల్సి వస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లోని యూఎస్ కాన్సులేట్ల వద్ద ఈ జాప్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో అత్యధికంగా సుమారు పన్నెండు నెలల పాటు వెయిటింగ్ టైమ్ ఉన్నట్లు తేలింది. ముంబైలో పదకొండున్నర నెలలు, న్యూఢిల్లీలో పది నెలల సమయం పడుతోంది. ప్రయాణికులు ముందుగానే వీసా ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.