ఆన్లైన్ షాపింగ్ మోసం: ఖాళీ డబ్బా పంపిణీ చేసిన అమెజాన్ కు భారీ షాక్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Punjab

ఆన్లైన్ లో రూ.22,440 విలువైన గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేస్తే ఖాళీ డబ్బా పంపిణీ చేసిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరియు విక్రేతకు పంజాబ్ జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ షాకిచ్చింది. ఈ మేరకు లోవిష్ చద్దా దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కమిషన్ రూ.10 వేల నష్టపరిహారంతో పాటు మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని తీర్పు వెల్లడించిందని కమీషన్ అధికారులు గురువారం స్పష్టం చేశారు.