వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ

రిపోర్టర్: jaleel sakshi స్థలం: సిర్పూర్ (టి)

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ (టి) మండల ప్రజలకు మరియు మిత్రులకు ఎస్ఐ డి. సాగర్ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు అన్ని రంగాలలో విజయాలు నిండాలని ఆయన మనసారా ఆకాంక్షించారు. పండుగను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.