ఎస్సీ ఎస్టీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతాన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు మరియు సంక్షేమ పథకాల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన, ఆదివాసీ వర్గాల సర్వతోముఖాభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేసిన సీఎం, ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం దళితులకు, 17 శాతం ఎస్టీలకు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే అఘాయిత్యాల బాధితులకు గ్రీన్ ఛానెల్ ద్వారా తక్షణ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.