అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి సూచన

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం రూరల్‌లో ప్రభుత్వ, సచివాలయ ఉద్యోగులు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. శుక్రవారం విజయనగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యలకు తప్పనిసరిగా పరిష్కారం చూపుతామని హామీ ఇస్తూ, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.