వినాయక చవితి రోజు కేటీఆర్ పీఏ, పీఆర్వో విచారణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
రేవంత్ సర్కార్ కక్షపూరిత ధోరణి పరాకాష్టకు చేరిందని బీఆర్‌ఎస్ మండిపడింది. సోమవారం వినాయక చవితి పండుగ రోజున విచారణకు హాజరుకావాలని కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ మూడో గేట్ వద్ద జరిగిన ఘటనలపై నమోదైన కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా, పండుగ పూట విచారణకు పిలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.