ఖమ్మంలో రెండు వేల మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ 13లో శ్రీ నవదుర్గ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రెండు వేల మంది భక్తులకు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు.