సినిమా ప్రియులకు గుడ్ న్యూస్: ప్రేక్షకుల ముందుకు ఆదర్శ కుటుంబం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30న దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. సుమారు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నిడివితో ఈ చిత్రం సిద్ధమైందని, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.