ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ అవార్డుపై డీజీపీ అభినందనలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ గా అవార్డు పొందడం పట్ల డీజీపీ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈగల్ ఫోర్స్ సిబ్బందికి, సందీప్ శాండిల్య నాయకత్వానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ఈ బలగం చేస్తున్న కృషి అభినందనీయమని డీజీపీ కొనియాడారు.