శ్రీవాణి ట్రస్ట్ నిధులతో దేవస్థానాల నిర్మాణం చేపట్టనున్నట్లు నేతల ప్రకటన

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

వెంకటాచలం మండలం ఎర్రగుంటలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతి కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారుల పౌష్టికాహారంపై ఆరా తీశారు. స్థానికుల తాగునీటి సమస్య పరిష్కారంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రహరీ గోడ నిర్మాణం, శ్మశాన అభివృద్ధికి హామీ ఇచ్చారు.