సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో షియా ఇస్మాయిలీల ఇమామ్ ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-5 కలిశారు. హైదరాబాద్ చారిత్రక కట్టడాలు, ఉస్మానియా ఆసుపత్రి భవన పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.