నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజం: కాంగ్రెస్ డీఎన్ఏ హిందూ వ్యతిరేకమంటూ ఫైర్
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
దేవాలయాల్ లో పూజారులు అకృత్యాలకు పాల్పడుతారంటూ విద్యార్థి కార్యకర్త నేహా బోరా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆలోచనల నుంచే ప్రేరణ పొందాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విమర్శలను ప్రతిధ్వనిస్తోందని, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని సైద్ధాంతిక ప్రచారం చేస్తోందని ప్రదీప్ భండారీ ధ్వజమెత్తారు.