తిరుపతి ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ తదితరులు మంత్రిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి, కీలక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.