మాజీ సర్పంచ్ రామారావు హత్య కేసు మిస్టరీని ఛేదించిన ఖాకీలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగిన హత్యపై దర్యాప్తు వేగవంతం చేసి ఆధారాలు సేకరించారు. సాంకేతిక విశ్లేషణ ఆధారంగా నిందితులను గుర్తించి వారి నుంచి రెండు కత్తులు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు అధికారులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.