పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటర్లు నిలిపివేత: అధికారుల కీలక ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: Eluru
గోదావరి నీటిమట్టం పడిపోవడంతో పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటర్లను నిలిపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వివిధ దశల్లో మోటార్ల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించామని, ఇప్పటివరకు మొత్తం అరవై ఏడు టిఎంసిల గోదావరి జలాలను తరలించినట్లు వారు వెల్లడించారు. నదిలో నీటి మట్టం పద్నాలుగు మీటర్లకు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.