'శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్': తిరుమలలో ఘన స్వాగతం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Tirumala

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆయన కలియుగ దైవాన్ని సేవించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.