జన్నారం బస్టాండ్లో మర్చిపోయిన బ్యాగును బాధితుడికి అందజేసిన కానిస్టేబుల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మందమర్రి పట్టణానికి చెందిన స్పోర్ట్స్ మాస్టర్ అభిషేక్ నిర్మల్లో జరిగిన క్రీడా పోటీలకు హాజరై తిరిగి వస్తుండగా జన్నారం బస్టాండ్లో విలువైన సర్టిఫికెట్లు ఉన్న బ్యాగును మరిచిపోయి బస్సు ఎక్కారు. ముత్యంపేట చేరుకున్నాక బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళన చెంది జన్నారం బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ చంద్రమౌళికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ బస్టాండ్ను పరిశీలించి బ్యాగును స్వాధీనం చేసుకుని సురక్షితంగా బాధితునికి అప్పగించడంతో పోలీసుల సేవలను అభిషేక్ అభినందించారు.