ఏపీలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో మూలపేట పోర్టులో టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుపై కీలక చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టుల ఆధారంగా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.