ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పట్టణ స్థానిక సంస్థల పోలింగ్

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. మొత్తం తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థల్ లో పోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు తొంభై తొమ్మిది లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్ లో పది వేలకు పైగా అభ్యర్థులు బరిలో నిలిచారని నవంబర్ మూడవ తేదీన ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.