లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారుడు జగన్ అంటూ టీడీపీ తీవ్ర విమర్శ
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్ అని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజల ప్రాణాలు తీసి, మహిళల తాళిబొట్లు తెంపి సంపాదించిన రూ.3200 కోట్ల ముడుపులు జగన్‌కే చేరాయని ఆ పార్టీ స్పష్టం చేసింది. డిస్టిలరీల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్ల వసూళ్లు జరిగాయని ఆరోపించింది.