గుండెపోటు బాధితుడి ప్రాణాలు కాపాడే మొదటి గంట కీలక విధివిధానాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రికి చేరేలోపు మొదటి గంటలో అందించే ప్రథమ చికిత్స ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేబ్దత్త మజుందార్ తెలిపారు. బాధితుడిని సౌకర్యవంతంగా కూర్చోబెట్టి, బిగుతుగా ఉన్న బట్టలను వదులు చేయాలని, వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేసి ధైర్యం చెప్పాలని పేర్కొన్నారు. సీపీఆర్ చేయడం వల్ల బతికే అవకాశాలు పెరుగుతాయని, ఛాతీ నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించి తక్షణమే స్పందించాలని ఆయన వెల్లడించారు.