తీవ్ర అలర్ట్: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.