సర్వీస్ రోడ్డు పనుల పరిశీలన: అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
రిపోర్టర్: సతీష్
స్థలం: ప్రకాశం
అభివృద్ధి పేరుతో గ్రామస్థులకు అసౌకర్యం కలిగించవద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మనపాలెం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మురుగునీరు ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్థులు తెలిపిన సమస్యపై స్పందించారు. గ్రామంలోకి నీరు రాకుండా తక్షణమే డ్రైనేజీ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు తెదేపా నాయకులు పాల్గొన్నారు.