నాసిరకం బొగ్గు సరఫరాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్ల రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. థర్మల్ పవర్ స్టేషన్లలో నిజానిజాలు తేల్చేందుకు గురువారం ఆరు బీఆర్ఎస్ బృందాలు పరిశీలనకు వెళ్తాయని హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ స్పష్టం చేశారు.