ఇగ్నో విద్యార్థులకు భారీ షాక్: ఆలస్యంగా అప్డేట్ అవుతున్న మార్కులు

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంబంధించి అసైన్మెంట్ మార్కులు మరియు ప్రాజెక్ట్ ఫలితాల అప్డేట్లో తీవ్ర జాప్యం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి సమర్పించినప్పటికీ ఆన్లైన్ రికార్డులు అసంపూర్ణంగానే ఉంటున్నాయని, దీనివల్ల పీహెచ్డీ ప్రవేశాలు అలాగే ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతోందని పలువురు విద్యార్థులు ఆందోళన వెలిబుచ్చారు. యూనివర్సిటీ అధికారులను సంప్రదించినా స్పందన కరువైందని వారు వాపోయారు.