పుణేలో దారుణం: స్నేహితుడిని హత్య చేసి కాళ్లు నరికిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Pune
మద్యం మత్తులో జరిగిన గొడవలో స్నేహితుడిని బేస్బాల్ బ్యాట్ తో కొి హత్య చేసి, ఆపై కాళ్లు నరికి చెత్త కుప్పలో పడేసిన భయానక ఘటన మహారాష్ట్రలోని పుణే నగరంలో వెలుగు చూసింది. పింపిల్ గురవ్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పింట్యా అలియాస్ విష్ణు తానాజీ కుంభర్గా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కోలి మీడియాకు తెలిపారు.