ఐదు హామీల అమలుతోనే ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామంటూ మంత్రి బాలకృష్ణ వ్యాఖ్య
రిపోర్టర్: సతీష్
స్థలం: బెంగళూరు
కర్ణాటకలో అమలు చేస్తున్న ఐదు హామీల పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి హెచ్.సి. బాలకృష్ణ స్పష్టం చేశారు. రామనగర్‌లో దివ్యాంగుల నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గ్యారెంటీలు లేకపోతే సమస్యలు ఇంత పెద్దవిగా ఉండేవి కాదని, బడ్జెట్ పరిమితులకు లోబడే పనులు చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే ఈ భారాన్ని సమర్థంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర పేర్కొన్నారు.