రాష్ట్రంలో రానున్న తీవ్ర కరువు: బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దని సీఎం రేవంత్ హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ప్రజలతో పాటు రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జూలై నాటికి కరువు ప్రభావం గరిష్ట స్థాయికి చేరి తాగునీటికీ ఇబ్బంది ఏర్పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నేతల అవాస్తవ ప్రచారాలను నమ్మి రైతులు ఎవరూ మోసపోవద్దని, పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.