'భారత ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం': రష్యా చమురు ఆంక్షలపై విదేశాంగ శాఖ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అమెరికా ప్రతినిధుల సభ బిల్లు ఆమోదించటంపై భారత్ దీటుగా స్పందించింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించటానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. అమెరికా కాంగ్రెస్‌లో శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి దిగుమతులు కొనసాగిస్తామని తేల్చిచెప్పింది. ఈ ఆంక్షల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాన్ని అమెరికాకు వివరించామని, తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.